
ప్రజలను మోసగించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయం
అరకులోయటౌన్: ప్రజలను మోసగించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ నాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు. పెదలబుడు పంచాయతీ పరిధిలోని మూడు ప్రాంతాల్లో పార్టీ కమిటీ నియామకాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ సొమ్మును రైతుల ఖాతాకు నేటికి పైసా కూడా జమచేయలేదన్నారు. బాబు ష్యూరిటి మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటించినపుడు స్థానిక మహిళలు చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలన, మోసాలను చెబుతున్నారన్నారు. మహిళలకు నిరుద్యోగ భృతి చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను పార్టీ నాయకులు గ్రామాల్లో పర్యటించి స్థానికులకు వివరించాలన్నారు. తల్లికి వందనం సొమ్మును పలు రకాల కారణాలతో లబ్ధిదారులకు అందజేయలేదన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలను కూడా ఉద్యోగులుగా గుర్తించి సంక్షేమ పథకాల్లో కోత విధిస్తూ అన్యాయం చేస్తుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సూచనల మేరకు పెదలబుడు మూడు సచివాలయాల పరిధిలో పార్టీ అధ్యక్ష, కార్యదర్శులను నియమించారు.
కమిటీల వివరాలు
పెదలబుడు–1 సచివాలయం అధ్యక్షుడిగా పి.ఆనంద్, ప్రధాన కార్యదర్శిగా జన్ని అప్పన్న, దురియా సంజీవ్, గొల్లోరి పద్మనాభరాజు, పెదలబుడు – 2 సచివాలయం అధ్యక్షుడుగా పట్టాసి సంపత్ కుమార్, కార్యదర్శులు కొడాలి శివశంకర్,
బి.శివప్రసాద్, పంచాడి తిరుపతిరావు, గొల్లోరి కోటిబావు, సచివాలయం –3 అధ్యక్షుడిగా ఎస్.రాజు, ప్రదాన కార్యదర్శులుగా కె.రమేష్, పి.శిభో, కె.ప్రసన్న కుమార్, రమేష్‌లతోపాటు నలుగురు చొప్పున కార్యదర్శులను నియమించారు. పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, మండల పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు స్వాభి రామ్మూర్తి, పల్లాసింగ్ విజయ్ కుమార్, పార్టీ జిల్లా బీసీ సెల్ అధ్యకుడు గెడ్డం నర్సింగరావు, ఎంపీటీసీ సభ్యులు దురియా ఆనంద్‌కుమార్, శత్రుఘ్న, వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, జిల్లా యువజన విభాగ మాజీ అధ్యక్షుడు కిరణ్, రాష్ట్ర ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శి నరసింహమూర్తి, వార్డు సభ్యుడు చిన్నారావు, నాయకుడు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలను మోసగించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయం

ప్రజలను మోసగించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయం