
ఘనంగా బళ్లారి రాఘవ జయంతి
పాడేరు : ఉన్నత విద్యను అభ్యసించి, లాయర్ వృత్తిని చేపట్టి నాటకరంగం మీద ఉన్న మక్కువతో తాను సంపాదించిన యావత్తు నాటక రంగ పురోగతికి త్యాగం చేసిన వ్యక్తి బళ్లారి రాఘువ కలెక్టరఱ్ దినేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అభిషేక్ గౌడ అన్నారు. ఆయన జయంతి వేడుకలను శనివారం పాడేరులో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ దినేష్‌కుమార్, ఐటీడీఏలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ఆయన చిత్రపటానికి పూలమాలలు ఘన నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరు సంస్కృతి, సంప్రదాయాలను, వివిద రంగాల్లో ప్రతిభ కనబరిచిన ప్రముఖులను స్మరించుకోవడం కర్తవ్యమన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, డీఆర్వో పద్మలత, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ కుమార్, ఐటీడీఏ ఏవో హేమలత, మేనేజర్ పరంజ్యోతి, కలెక్టరేట్, ఐటీడీఏ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా బళ్లారి రాఘవ జయంతి