
నేటి నుంచిశ్రావణమాస పూజలు
డాబాగార్డెన్స్ (విశాఖ): ఉత్తరాంధ్రుల ఇలవేల్పు కనమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం నుంచి వచ్చే నెల 23 వరకు శ్రావణమాసాన్ని పురస్కరించుకుని శ్రావణలక్ష్మి ప్రత్యేక కుంకుమ పూజలు జరపనున్నారు. ఈ ప్రత్యేక పూజలో సంకల్పం, లక్ష్మీ సహస్ర నామాలు, లక్ష్మీ హోమం, అమ్మవారి దర్శనం, వేద ఆశీర్వచనం చేపట్టనున్నారు. విశిష్ట సామూహిక కుంకుమ పూజలో పాల్గొనదలిచే భక్తులు (దంపతులు) రూ.400 టికెట్ రుసుం చెల్లించాలి. పూజ అనంతరం భక్తులకు శేషవస్త్రంగా కండువా, జాకెట్టు ముక్క, పావుకేజీ పులిహోర, పావుకేజీ చక్కెర పొంగలి, శ్రీచక్రయంత్రం (రాగి)ని మహాప్రసాదంగా అందజేస్తారు. శ్రావణమాసంలో వచ్చే మూడో శుక్రవారం (ఆగస్టు 8) వరలక్ష్మీవ్రతం, 9న శ్రావణ పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అలాగే శ్రావణమాసంలో వచ్చే ఐదు శుక్రవారాలు (ఈ నెల 25, ఆగస్టు 1, 8, 15, 23) ప్రత్యేక పూజలు జరపనున్నారు.