
గిరిజనులను మోసం చేసిన ఘనత చంద్రబాబుది
పాడేరు : ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు గుప్పించి, తీరా అధికారంలోకి వచ్చాక ఒక్కటీ అమలు చేయకుండా గిరిజనులను చంద్రబాబు నాయుడు నిలువునా మోసం చేశారని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు అన్నారు. మండలంలోని గొండెలి, కించూరు పంచాయతీల పరిధిలోని పలు గ్రామాల్లో మంగళవారం బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ మోసాలను, వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఒక్క హామీని కూడా నెరవేర్చలేని అసమర్థ పాలనను కూటమి ప్రభుత్వం చేస్తోందని చెప్పారు. కూటమి నాయకులు గ్రామాల్లోకి వస్తే నిలదీయాలన్నారు. వైఎస్సార్‌సీపీ నిత్యం ప్రజల పక్షాన ఉంటూ పోరాటాలు కొనసాగిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల ఉపాధ్యక్షుడు, సర్పంచ్ వనుగు బసవన్నదొర, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి, కించూరు సర్పంచ్ వంతాల రాంబాబు, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు పలాసి రాజేశ్వరి, పార్టీ సీనియర్ నాయకులు పలాసి కోటేశ్వరరావు, పలాసి రామారావు, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, గిరిజనులు పాల్గొన్నారు.
‘కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత’
డుంబ్రిగుడ: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా హామీలు అమలు చేయకపోవడంతో పాటు గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని
వైఎస్సార్‌సీపీ మండల మహిళా అధ్యక్షురాలు బంగారు శాంతి, ఉపాధ్యక్షుడు ఎ.గణపతి అన్నారు. మండలంలోని అరమ పంచాయతీలో మంగళ వారం బాబూ ష్యూరిటీ– మోసం గ్యారెంటీ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ పాలనతో సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ప్రశ్నించగా, ఏ పథకాలు అందడం లేదని, తాము ఇబ్బందులు పడుతున్నా మని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరమ, కురిడి మాజీ ఎంపీటీసీలు మొద్దు, మహా దేవ్, పార్టీ మండల కార్యదర్శి మఠం శంకర్, సీనియర్ నాయకులు బాకా సింహాచలం, విజయదశమి, ఆ పంచాయతీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
పథకాలు అందక అవస్థలు
అనంతగిరి(అరకులోయ టౌన్): కూటమి నాయకులు ఇచ్చిన హామీలు అమలు కాక, పథకాలు అందక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కొర్ర సూర్యనారాయణ, ఎంపీపీ శెట్టి నీలవేణి తెలిపారు.
కివర్ల, పినకోట, పెదకోట పంచాయతీల్లో మంగళవారం బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో వైఫల్యాలను వివరించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ గ్రామ స్థాయి కమిటీల నియమించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈకార్యక్రమంలో వైస్ ఎంపీపీ బాడం శకుంతల, మాజీ జడ్పీటీసీ దూరు గంగన్నదొర, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

గిరిజనులను మోసం చేసిన ఘనత చంద్రబాబుది

గిరిజనులను మోసం చేసిన ఘనత చంద్రబాబుది