
పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలి
● జేసీ, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అభిషేక్ గౌడ
పాడేరు: ఆర్థిక స్థోమత కలిగిన ప్రతిఒక్కరూ పేద గిరిజన కుటుంబాలను దత్తత తీసుకోవాలని జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అభిషేక్ గౌడ పిలుపునిచ్చారు. పి4 బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన పెదబయలు మండలం పొయిపల్లి పంచాయతీ సైలంకోట గ్రామానికి చెందిన జర్సింగి తెల్లన్న కుటుంబా న్ని దత్తత తీసుకున్నారు. తెల్లన్నకు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారన్నారు. కుమార్తె రమాదేవి సూపర్ ఫిఫ్టీకు ఎంపికై ప్రస్తుతం మరికవలస కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోందన్నారు. ఆమె ఉన్నత చదువులకు తాను పూర్తి గా తోడ్పాటు అందిస్తానన్నారు. అనంతరం వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.