ప్రకృతి అందాలు ఎంతో అద్భుతం
● సినీ నటుడు నాగినీడు
డుంబ్రిగుడ: మన్యంలో ప్రకృతి అందాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని సినీ నటుడు నాగినీడు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని అంజోడ సిల్క్‌ఫారం అరకు పైనరీని సందర్శించారు. మంచు తెరల్లో పైన్, యూకలిప్టస్ చెట్ల అందాలను తిలకించారు. సమీపంలోని శాంతినగరంలో గ్రామస్తులతో కొంతసేపు ముచ్చటించారు. పిల్లలతో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక్కడ వాతావరణం మాదిరిగానే ప్రజలు కల్మషం లేకుండా ఎంతో ఆప్యాయతతో ఆదరిస్తున్నారన్నారు.


