
లైన్‌మన్‌కు తీవ్ర గాయాలు
పాడేరు : విద్యుత్ స్తంభం వైర్లు సరిచేస్తున్న సమయంలో విరిగి పడటంతో లైన్‌మన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని ఇరడాపల్లి పంచాయతీ ఎస్.బొడ్డాపుట్టు గ్రామంలో ఆదివారం లైన్‌మన్ మసాడ హరికృష్ణ విద్యుత్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా ఉన్నట్టుండి స్తంభం విరిగిపడిపోయింది. దీంతో అతను కిందపడిపోవడంతో కాలు, తలభాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పరిసర ప్రాంతీయులు అతడిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించడంతో వైద్యసేవలు అందిస్తున్నారు. ఇలావుండగా విద్యుత్‌శాఖ అధికారులు స్పందించి ఇరడాపల్లి పంచాయతీలోని గ్రామాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటుచేయాలని సర్పంచ్ గుల్లేల అశ్వజ కోరారు.
వైర్లు సరిచేస్తుండగా విరిగిన స్తంభం
పైనుంచి కింద పడిపోవడంతో ప్రమాదం
వెంటనే పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలింపు