మరో క్వారీ నిర్వహణకు నిరాకరణ
మరో క్వారీ నిర్వహణకు నిరాకరణ
గంగవరం మండలం ఓజుబంద గ్రామానికి అనుకుని మూడు క్వారీలు నిర్వహిస్తున్నారు. ఒప్పందం ప్రకారం క్వారీల ద్వారా వచ్చిన ఆదాయంలో గ్రామాభివృద్ధికి కొంత నగదు ఇచ్చే వారు. పదేళ్ల నుంచి క్వారీ నిర్వాహకులు గ్రామాభివృద్ధికి చిల్లిగవ్వ కూడా ఇవ్వడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. పాత క్వారీలు కాకుండా కొత్త క్వారీ నిర్వహణకు ఓజుబందలో రెవెన్యూ అధికారులు గ్రామ సభ నిర్వహించగా గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే ఉన్న క్వారీల వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటే మరో క్వారీకి అనుమతులు ఎలా ఇస్తారని నిలదీశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న క్వారీలో కూడా తవ్వకాలు నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


