విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్న విద్యాశాఖ
ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ గోపిమూర్తి
రంపచోడవరం: ప్రభుత్వ విద్యారంగాన్ని భ్రష్టుపట్టించేలా విద్యాశాఖ నిర్ణయాలు ఉన్నాయని ఉభయగోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి అన్నారు. మారేడుమిల్లిలో సోమవారం నిర్వహించిన అల్లూరి జిల్లా యూటీఎఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. బోధనేతర పనుల వల్ల ఉపాధ్యాయులు బోధనకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూటీఎఫ్ మాజీ కార్యదర్శి జి.ప్రభాకర్ వర్మ మాట్లాడుతూ యూటీఎఫ్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 50 ఏళ్ల కాలంలో ఉపాధ్యాయులకు అనేక రాయితీలు, సౌకర్యాలు కల్పించడానికి విశేషమైన కృషి జరిగినట్టు చెప్పారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నా రు. పోలవరం జిల్లా యూటీఎఫ్ అధ్యక్షుడిగా జి.విశ్వరాజ్, గౌరవ అధ్యక్షుడిగా పి.కృష్ణయ్య, సహాధ్యక్షులుగా ఎస్.నాగేశ్వరరావు, బి.వెంకటలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా కె.కృష్ణ, కోశాధికారిగా బొజ్జియ్య, ఆరుగురు కార్యవర్గ సభ్యు లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కారం సూరిబాబు, కె.ఆదిరెడ్డి, పి. కొండయ్య, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


