నిబంధనలు గోరీ
అనుమతి పేరుతో అదనపు దోపిడీ?
● ఇష్టానుసారంగా బ్లాస్టింగ్
● దెబ్బతింటున్న ఇళ్లు, పొలాలు
● అనారోగ్యానికి గురవుతున్న గిరిజనులు
● ధర్నా చేసినా పట్టించుకోని అధికారులు
రంపచోడవరం: నియోజకవర్గంలోని గంగవరం మండలం ఓజుబంద గ్రామానికి అనుకుని ఉన్న నల్లరాయి క్వారీల నిర్వాహకులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు.. కంట్రోల్ బ్లాస్టింగ్ చేయకపోడంతో పేలుళ్ల ధాటికి రాళ్లు, ధూళి ఎరిగిపడుతున్నాయి. బూడిద గ్రామాన్ని కప్పెస్తోందని, అనుమతి లేని ప్రాంతంలో కూడా తవ్వకాలు జోరుగా సాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిసున్నారు.
ఆందోళన చేసినా..
క్వారీల్లో బ్లాస్టింగ్ వల్ల తమ బతుకులు నాశనమతున్నాయని, తవ్వకాలు నిలిపివేయాలని కొన్నాళ్లుగా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రంపచోడవరం పీవో స్మరణ్‌రాజ్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డిలను కలిసి విజ్ఞప్తి చేశారు. ఐటీడీఏ ఎదుట ఆందోళన చేశారు. అయినా అధికారులు స్పందించలేదని గ్రా మస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రంపచోడవరం ఐటీడీఏ ఎదుట ఆందోళన చేస్తున్న గిరిజనులు(ఫైల్)
ఓజుబంద నల్లరాయి క్వారీల్లో ఇష్టానురీతిగా తవ్వకాలు జరుపుతుండడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిర్వహకులు ఒప్పందాలకు విరుద్ధంగా వ్యహరిస్తున్నారని, దీంతో పంటలు, తమ ఆరోగ్యం దెబ్బ తింటున్నాయని వాపోతున్నారు. ఈ విషయమై అధికారులు వినతులిచ్చినా, ఐటీడీఏ ఎదుట ధర్నా చేసినా పట్టించుకునే నాథుడే కరవయ్యాడని వారు తెలిపారు.
నిబంధనలు గోరీ
నిబంధనలు గోరీ


