ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థి దశ నుంచే శాసీ్త్రయ దృక్పథం పెంపొందించుకోవాలని డీఈవో మాధవి అన్నారు. శనివారం ప్రభుత్వ డైట్ కళాశాలలో జిల్లా స్థాయి సౌత్ ఇండియా సైన్స్ డ్రామా, సెమినార్ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సైన్స్ డ్రామాలో సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హైస్కూల్ ప్రథమ, జెడ్పీఎస్‌ఎస్ లక్ష్మీపూర్ ద్వితీయ స్థానాలు సాధించాయి. సెమినార్‌లో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థిని ఎస్.వైష్ణవి ప్రథమ, సెయింట్ జోసెఫ్ విద్యార్థిని సీహెచ్.సహస్ర ద్వితీయ స్థానంలో నిలిచారు. ప్రథమ స్థానంలో నిలిచిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా సైన్స్ అధికారి ఆరె భాస్కర్ తెలిపారు. న్యాయనిర్ణేతలుగా గిరీష్ స్వామి, ప్రశాంత్, సుజిత్ వ్యవహరించారు. కార్యక్రమంలో డైట్ ప్రిన్సిపాల్ డాక్టర్ అబ్దుల్ హై, వైస్ ప్రిన్సిపాల్ కిరణ్, ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


