నెల్లూరు(వీఆర్సీసెంటర్): నగరంలోని విద్యుత్ భవన్‌లో సోమవారం నిర్వహించిన ‘డయల్ యువర్ ఎస్‌ఈ’ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి నలుగురు విద్యుత్ వినియోగదారులు ఫిర్యాదులు అందజేశారు. స్తంభాలు, లైన్ల మార్పు, మున్సిపల్ లైన్లకు సంబంధించిన సమస్యలను వారు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఏపీఎస్‌పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈ రాఘవేంద్రం తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ‘డయల్ యువర్ ఎస్‌ఈ’ కార్యక్రమాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఈఈ (టెక్నికల్) అల్తాఫ్, డీఈఈ మునీంద్ర, ఏఈలు తిరుపతయ్య, నరసింహారావు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.


