ఒంగోలు మెట్రో: ఒంగోలు కొండపై శ్రీగిరి వెంకటేశ్వర స్వామి త్రయాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీగిరి దేవస్థానం అర్చకులు వేద పండితులు శ్రీవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. వైఖానస ఆగమ పండితులు పరాంకుశం సీతారామాచార్యులు బృందం ఆధ్వర్యంలో ధ్వజారోహణంతో పాటు శ్రీవారి ఉత్సవ మూర్తులకు విశేష స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని వేడుకగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీవారికి హనుమంత వాహన సేవను నేత్ర పర్వంగా నిర్వహించారు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు, ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు ప్రసంగించారు.


