అనుమతులు లేని హోటళ్లపై చర్యలు | - | Sakshi
Sakshi News home page

అనుమతులు లేని హోటళ్లపై చర్యలు

Jun 24 2026 8:28 AM | Updated on Jun 24 2026 8:28 AM

దుకాణాల ముందు గాడులు తీయించిన హైవే అధికారులు

మద్దిపాడు: జాతీయ రహదారి వెంట ఎటువంటి పార్కింగ్‌ స్థలాలు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న పలు హోటళ్లు, టీ దుకాణాలు, వ్యాపార సముదాయాల ముందు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా సిబ్బంది మంగళవారం గాడులు తవ్వించారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో జాతీయ రహదారి వెంట అనుమతులు తీసుకోకుండా, పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేసుకోకుండా దుకాణాలు నడుపుతున్న పలుచోట్ల గాడులు తవ్వించి.. పార్కింగ్‌ స్థలం ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు జాతీయ రహదారి సిబ్బంది తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement