ఒంగోలు టౌన్: ఒంగోలులో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు మంగళవారం హెల్ప్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయాన్ని సందర్శించారు. ఇటీవల సంస్థ కార్యదర్శి నిమ్మరాజు రామమోహన్ సతీమణి ప్రమీల గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకున్న ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామ్మోహన్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. చైర్మన్ సూర్యనారయణ రాజు మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, బాలల అక్రమ రవాణా నిరోధం, బాలల సంక్షేమం కోసం రామ్మోహన్ చేస్తున్న కృషిని కొనియాడారు. చైర్మన్ వెంట కమిషన్ సభ్యులు వి.గాంధీ, హెల్ప్ టీఐ ప్రాజెక్టు డైరెక్టర్ బీవీ సాగర్, జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు నీలిమ, జిల్లా బాలల సంరక్షణ అధికారి పి.దినేష్ కుమార్ పాల్గొన్నారు.


