7న మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన | - | Sakshi
Sakshi News home page

7న మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన

Jun 24 2026 8:28 AM | Updated on Jun 24 2026 8:28 AM

నాగులుప్పలపాడు: మాదిగల చరిత్ర, సంస్కృతి, ఆగ్మగౌరవానికి శాశ్వత ప్రతీకగా నిలవనున్న మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమం జయప్రదం చేయాలని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ కోరారు. జూలై 7న ఎంఆర్‌పీఎస్‌ ఆవిర్భావ దినోత్పవం సందర్భంగా ఉద్యమం పుట్టిన ఊరు ఈదుమూడి గ్రామంలో జరుగుతున్న ఈ చారిత్రాత్మక శంకుస్థాపన కార్యక్రమంకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాదిగ జాతి యువత, మహిళలు, నాయకులతో పాటు నాలుగు రాష్ట్రాల మంత్రులు కూడా హజరుకానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఉప్పుగుండూరు గ్రామంలో కరపత్రం ఆవిష్కరణ చేశారు. వ్యవస్థాపక సభ్యులు కొమ్మూరి గరటయ్య, కొమ్మూరి సుధాకర్‌, ముంగర నాగార్జున, మల్లెల ప్రసాద్‌, అత్తంటి డేవిడ్‌, కొలకలూరి సుబ్బారావు, పాలపర్తి రత్నాకర్‌ బాబు, పాలపర్తి ప్రవీణ్‌, గంగవరపు అశోక్‌, మురికిపూడి ప్రకాశం తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement