శంఖవరం: మండలంలోని కత్తిపూడి వద్ద జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. శంఖవరం గ్రామానికి చెందిన రోకల కార్తీక్ (19), మెరుగుల స్వరూప్ కుమార్ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ, కత్తిపూడి నుంచి అన్నవరం వైపు వెళ్లే మార్గంలో పెట్రోల్ బంకు సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కార్తిక్ తలకు, శరీరంలోని పలుచోట్ల తీవ్ర గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని, తీవ్రంగా గాయపడిన స్వరూప్ కుమార్‌ను 108లో ప్రత్తిపాడు కమ్యునిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అన్నవరం ఎస్సై ప్రసాద్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అన్నవరం పోలీసులు కేసు నమోదు చసి దర్యాప్తు చేపడుతున్నారు.
గాయపడిన స్వరూప్
మృతుడు కార్తిక్
మరొకరికి తీవ్ర గాయాలు


