అమలాపురం రూరల్: ఉభయగోదావరి జిల్లాల్లో మోటార్ సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు అంతర్ జిల్లాల దొంగల ముఠాను పోలీసులుఅరెస్టు చేసి, వారి నుంచి రూ. 38 లక్షల విలులైన 38 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఈ వివరాలను అమలాపురం ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. గత నెల 22న రాత్రి రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో ఓ ఇంటి బయట పార్క్ చేసిన మోటారు సైకిల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీనిపై రావులపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు పెదపూడి మండలం రాజుపాలేనికి చెందిన లక్కోజు రాజేష్ కుమార్, జి.మామిడాడ చెందిన కళ్యాణం నరేష్ (బజి), గుండుపల్లి సూర్యతేజ, గండేపల్లి మండలం యర్రంపాలేనికి చెందిన రొట్టె నాగచైతన్య సంతోష్‌కుమార్, ఓ బాలుడు కలసి ఈ చోరీలు చేస్తున్నారు.


