అబ్బురపరుస్తున్న ఆరుద్ర పురుగులు | - | Sakshi
Sakshi News home page

అబ్బురపరుస్తున్న ఆరుద్ర పురుగులు

Jun 23 2026 12:24 AM | Updated on Jun 23 2026 12:24 AM

రాజవొమ్మంగి: మండలంలోని పంట పొలాల్లో ఆరుద్ర పురుగులు ఆకట్టుకుంటున్నాయి. ఎర్రగా సింధూర బొట్టులా కనిపించే ఈ పురుగులను(కీటకాలను) రైతులు తమ నేస్తాలుగా భావిస్తారు. పొలం దున్నే సమయంలో ఆరుద్ర పురుగులు కనిపిస్తే శుభ సూచకం అంటారు. ఈ పురుగులు వచ్చాయంటే ఇక సంమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, చెరువులు నిండుతాయని, కుంటల్లోకి నీరు చేరుతుందని రైతుల నమ్మకం. దుక్కులు దున్నే సమయంలో మట్టిలోంచి ఇవి బయటకు వస్తాయి. పంటలకు హాని కలిగించే పురుగుల లార్వాను (గుడ్లను) ఈ ఆరుద్ర పురుగులు తింటాయని, తద్వారా పంటలపై చీడపీడల బెడద తగ్గుతుందని శాస్త్రజ్ఞులు చెబుతారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement