రంపచోడవరం/ గంగవరం: జిల్లాలో నిరుద్యోగుల కోసం ఈ నెల 30న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తామని కలెక్టర్ కె.దినేష్ కుమార్ తెలిపారు. సోమవారం స్థానిక ఐటీడీఏ సమావేశ భవనంలో మెగా జాబ్‌మేళా పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పదో తరగతి ఆపై చదువుకున్న యువతీ యువకులకు స్థానిక ఐటీడీఏ ప్రాంగణంలో ఆ రోజు ఉదయం 10 గంటలకు నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా 16 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలతో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. మరిన్ని వివరాలకు 63046 34447 ఫోన్ నంబరులో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో జేసీ ప్రశాంత్ కుమార్, రెవెన్యూ డివిజనల్ అధికారి పి.అంబేద్కర్, రంపచోడవరం రెవెన్యూ డివిజనల్ అధికారి కె.స్వాతి, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి నిరుపమ తదితరులు పాల్గొన్నారు.


