కేసులు ఎక్కువగా వస్తున్నాయి | - | Sakshi
Sakshi News home page

కేసులు ఎక్కువగా వస్తున్నాయి

Jun 23 2026 12:24 AM | Updated on Jun 23 2026 12:24 AM

రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి మలేరియా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. పీహెచ్‌సీల్లో ఒకటి, రెండు రోజులు మలేరియా కోసం చికిత్స పొందిన తరువాత ఏరియా ఆసుపత్రికి రిఫర్‌ చేస్తున్నారు. ఇక్కడ మలేరియాతో వచ్చిన రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నాం. కొన్ని కేసులకు చికిత్స అందించిన తరువాత డిచార్జ్‌ చేస్తున్నాం.

–సూర్యప్రకాష్‌, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌, రంపచోడవరం

సేవలపై ఎందుకో నిర్లక్ష్యం

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మలేరియా నియంత్రణకు కట్టదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఆ ఐదేళ్లలో మలేరియా తీవ్రత చాలా తగ్గింది. ప్రస్తుతం ఏజెన్సీలో వైద్య సేవలపై నిర్లక్ష్యం ఆవరించింది. మలేరియా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. ఏజెన్సీలో ఆరోగ్య అత్యవసర పరిస్థితులు రాకుండా మలేరియాను కట్టడి చేయాలి.

– గొర్లె బాలాజీబాబు, జెడ్పీటీసీ, మారేడుమిల్లి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement