యోగాతో సంపూర్ణ ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

Jun 16 2026 1:40 AM | Updated on Jun 16 2026 1:40 AM

కలెక్టర్‌ రాజాబాబు

కొత్తపట్నం: నిత్యం యోగాతో సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చని కలెక్టర్‌ పి.రాజాబాబు అన్నారు. ప్రతిఒక్కరూ చిన్ననాటి నుంచే యోగా సాధన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో జరుగుతున్న యోగా సాధన కార్యక్రమాలలో భాగంగా సోమవారం కొత్తపట్నం మండలంలోని కె.పల్లెపాలెం బీచ్‌లో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ నూకసాని బాలాజీ, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌, పీడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ కామేపల్లి సీతారామయ్యతో కలిసి కలెక్టర్‌ యోగా చేశారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి తేళ్ల రవికుమార్‌, యోగాంధ్ర ఆఫీసర్‌ డాక్టర్‌ భీమ్‌నాథ, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా స్థాయి అధికారులు, కొత్తపట్నం తహసీల్దార్‌ డి.రామానాయుడు, ఎంపీడీవో శ్రీకృష్ణ, వివిధ శాఖల సిబ్బంది, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement