సముద్రంలో చేపల వేట మళ్లీ మొదలైంది. కొద్దిరోజులుగా కొనసాగుతున్న
వేట విరామం ఆదివారంతో ముగిసింది. సోమవారం వేకువజాము నుంచే మత్స్యకారులు వలలు, బోట్లు, తదితర వేట సామగ్రితో సముద్రంలో చేపల వేటకు బయలుదేరి వెళ్లారు. ఎన్నో కలలతో అలలపై ప్రయాణం ఆరంభించారు. ఆయా సంఘటనలతో కొత్తపట్నంలోని కె.పల్లెపాలెం బీచ్‌లో పండుగ
వాతావరణం నెలకొంది. ఆయా దృశ్యాలను ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది
– సాక్షి, ఒంగోలు


