ఘనంగా మాజీ మంత్రి మేరుగు జన్మదినం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా మాజీ మంత్రి మేరుగు జన్మదినం

Jun 16 2026 1:40 AM | Updated on Jun 16 2026 1:40 AM

ఘనంగా మాజీ మంత్రి మేరుగు జన్మదినం

సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్‌): వైఎస్సార్‌ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున జన్మదిన వేడుకలను సంతనూతలపాడులోని ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి కేక్‌ కట్‌ చేయగా, పలువురు నాయకులు పాల్గొని మేరుగు నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సంతనూతలపాడు ఎంపీపీ బుడంగుంట విజయ, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, మండల అధ్యక్షురాలు ఎం.సీత, సొసైటీ మాజీ అధ్యక్షుడు దుంపా ఎల్లమందారెడ్డి, మాదాల వెంకట్రావు, పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి పల్లెపాటి రామారావు, నాయకులు గొడుగు కాలేశా, రావూరి శ్రీనివాసరెడ్డి, వెంకారెడ్డి, కె.నాగాంజనేయులు, కె.లక్ష్మణ్‌, వల్లపు శ్రీను, షేక్‌ మస్తాన్‌వలి, అంజి, వెంకట్రావు, బి.నాగేశ్వరరావు, రాజబాబు, అల్లాబక్షు, రామచంద్రారెడ్డి, తేళ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

మద్దిపాడులో...

మద్దిపాడు: మద్దిపాడులోని వైఎస్సార్‌ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం మాజీ మంత్రి మేరుగు నాగార్జున జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ వాకా అరుణ కోటిరెడ్డి కేక్‌ కట్‌ చేసి మేరుగు నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మోరబోయిన సంజీవరావు, బెజవాడ శ్రీరామ్మూర్తి, బొమ్మల రామాంజనేయులు, గుడ్డపాతల రవి, పల్లపాటి అన్వేష్‌, కంకణాల సురేష్‌, పైడిపాటి వెంకట్రావు, మనం సంధ్య, కాకర్లపూడి రజిని, కందుల డానియేల్‌, సన్నపురెడ్డి రమణమ్మ, నాదెండ్ల మహేష్‌, గద్దె జాలయ్య, మేకల కృష్ణారెడ్డి, మద్దినేని శ్రీకాంత్‌, పిట్టల ఆంజనేయులు, మంద చిన్న, బొమ్మల దాసు, పైనం ప్రభాకర్‌రావు, కాకుమాను శశి, జగన్నాథం, పూర్ణచంద్రరావు, బొమ్మల జగ్గయ్య, రహీం, రాంబాబు, అద్దంకి శ్రీకాంత్‌, అన్నంగి మోహన్‌, వల్లెపు వెంకటేశ్వర్లు, వేల్పుల సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

ఉప్పుగుండూరులో...

నాగులుప్పలపాడు: మండలంలోని ఉప్పుగుండూరులో సోమవారం మాజీ మంత్రి మేరుగు నాగార్జున జన్మదినాన్ని వైఎస్సార్‌ సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అరుణోదయ వృద్ధాశ్రమంలో వృద్ధులచే పుట్టినరోజు కేక్‌ కట్‌ చేయించారు. ఆశ్రమంలోని వృద్ధులకు భోజనాలు వడ్డించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ గ్రీవెన్స్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పోలినేని కోటేశ్వరరావు, నాయకులు పేరాల చెన్నకేశవులు, యువజన, రైతు విభాగం మండల అధ్యక్షులు ఇమ్మిశెట్టి బాలకృష్ణ, తగిరిశ సుబ్బారావు, నాయకులు గండు హరిబాబు, కొలకలూరి విజయ్‌ కుమార్‌, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కూనంనేనివారిపాలెంలో...

చీమకుర్తి రూరల్‌: మండలంలోని కూనంనేనివారిపాలెంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున పుట్టినరోజు వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అభయాంజనేయస్వామి దేవాలయంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు పూజలు చేయించారు. పార్టీ మండల అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు నివాసంలో కేక్‌ కటింగ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు చీదర్ల శేషు, గ్రామ అధ్యక్షుడు ఎర్రగుంట్ల మోహన్‌, వసంతరావు, గోరంట్ల రామకృష్ణ, నల్లూరి నారాయణ, పి.శ్రీను, హనుమంతరావు, రమేష్‌, పేరయ్య, దాసు, వేమా గోవింద్‌, ఇమ్మాన్యేలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement