1983లో ఎన్టీఆర్ సీఎం హోదాలో తొలిసారి మా మండలానికి వచ్చారు. మళ్లీ 26 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి సీఎంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు రావడం ఆనందంగా ఉంది. బోథ్‌లో మినీ స్టేడియం మంజూరు చేయాలి. రూ.18 కోట్లతో చేపట్టిన భీంపూర్– కరంజీ అంతర్రాష్ట్ర రోడ్డ్డును త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలి. నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను పిప్రిలోనే ఏర్పాటు చేయాలి. జిల్లాను ప్రత్యేకంగా పరిగణిస్తూ ఆర్‌అండ్ బీ, పంచాయతీరాజ్, ఐటీడీఏ పరిధిలోని పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలి.
– గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్


