మహిళా సంఘాలకు చెక్కు.. ఐదు గ్రామాలకు ‘ఐఎస్‌వో’ | - | Sakshi
Sakshi News home page

మహిళా సంఘాలకు చెక్కు.. ఐదు గ్రామాలకు ‘ఐఎస్‌వో’

Apr 7 2026 7:37 AM | Updated on Apr 7 2026 7:37 AM

కై లాస్‌నగర్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 30,149 స్వయం స్వహాయక సంఘాలకు మంజూరైన రూ.53.50 కోట్ల వడ్డీలేని రుణాల చెక్కును సీఎం రేవంత్‌రెడ్డి మహిళలకు అందజేశారు. అలాగే జిల్లాలోని నార్నూర్‌, ముఖరా, ముత్నూర్‌, పిప్రి, వన్వాట్‌ గ్రామ పంచాయతీలకు ఐఎస్‌వో సర్టిఫికెట్లను ఆయా సర్పంచ్‌లకు అందజేసి అభినందించారు. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందిన ఐదుగురు ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇంటి మంజూరు ప్రొసీడింగ్‌ ఉత్తర్వులు అందించారు. ఇటీవల నిర్వహించిన సీఎం కప్‌ రెండోవిడత పోటీల్లో ఒవరాల్‌ చాంపియన్‌గా నిలిచిన క్రీడాకారులకు ట్రోఫీ అందజేసి అభినందనలు తెలిపారు.

సీఎంకు ఘన స్వాగతం

ముందుగా ప్రత్యేక హెలికాప్టర్‌లో పిప్రికి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎంపీ నగేష్‌, ఎమ్మెల్యేలు శంకర్‌, బొజ్జు, అనిల్‌ జాదవ్‌, కలెక్టర్‌ రాజర్షి షా, ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌, డీఎఫ్‌వో ప్రశాంత్‌ బాజీరావు పాటిల్‌ తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement