మార్కాపురం టౌన్: చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారు వామన అలంకారంలో వ్యాళి వాహనంపై సోమవారం రాత్రి భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులకు అర్చన, నివేదన, మంగళ హారతులను ఆలయ అర్చకులు అప్పనాచార్యులు, అర్చక బృందం నిర్వహించారు. నగరోత్సవాన్ని నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఈవో జీ.శ్రీనివాసరెడ్డి, ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.
రేపు పొన్న వాహన సేవ:
లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చెన్నకేశవస్వామి వారు మురళీకృష్ణ అలంకారంలో పొన్నవాహనంపై బుధవారం ఉదయం (పగలు ఉత్సవం) భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఉత్సవంలో భాగంగా నగరోత్సవం ముందు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించాలని కోరారు.


