● రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ అదనపు డైరెక్టర్ శ్రీధర్
కైలాస్‌నగర్: జిల్లాలోని షెడ్యూల్డు కులాల ప్రభుత్వ వసతి గృహాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను వంద శాతం ప్రవేశాలు కల్పించాలని రాష్ట్ర షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ అదనపు డైరెక్టర్ సి. శ్రీధర్ ఆదేశించారు. జిల్లాలో పర్యటించిన ఆ యన ఇచ్చోడ, బజార్‌హత్నూర్ ఎస్సీ బాలుర, బా లికల వసతి గృహాలతో పాటు ఆదిలాబాద్‌లోని కళాశాల బాలికల వసతి గృహాన్ని మంగళవారం సందర్శించారు. రికార్డులు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాలపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన లోపాలను తక్షణమే సవరించాలని అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వసతి గృహ సంక్షేమ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వసతి గృహాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి విద్యార్థులకు డిజిటల్ తరగతులు నిర్వహించాలన్నారు. ప్రతి నె లా వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి రెండు నెలలకోసారి సమావేశం నిర్వహించి నాణ్య మైన ఆహారం అందేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సమీక్ష, ఎస్సీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్, మ్యానువల్ స్కావెంజర్స్ కమిటీ సమావేశాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి విధిగా నిర్వహించా లని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి సునీతా కుమారి, సహాయ అభివృద్ధి అధికారులు నారాయణరెడ్డి, నర్సింగ్ పాల్గొన్నారు.
10న ఆన్‌లైన్ మూల్యాంకనంపై సమావేశం
ఆదిలాబాద్‌టౌన్: ఈ విద్యా సంవత్సరం నుంచి కాకతీయ యూనివర్సిటీ పరిధిలో చదువుతున్న విద్యార్థుల జవాబు పత్రాలను ఆన్‌లైన్ విధానంలో మూల్యాంకనం చేయాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. దీనిపై అవగాహన కల్పించేందుకోసం ఈ నెల 10న జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో సమావేశం నిర్వహించనున్నారు. కాగా ఈ విఽ దానాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నట్లు టీపీడీఎంఏ రాష్ట్ర సభ్యులు, బేల కీర్తన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వరప్రసాద్ రావు తెలిపారు. ఆన్‌లైన్ విధానంలో మూల్యాకంన చేయడం ద్వా రా ఫలితాలు త్వరగా రావడంతో పాటు అక్రమాలు జరగకుండా ఉంటాయని 15 ఏళ్ల క్రిత మే విషయాన్ని యూనివర్సిటీ అధికారుల దృష్టి కి తీసుకువెళ్లినట్లుగా ఆయన గుర్తు చేశారు.


