బెటాలియన్‌లో అభివృద్ధి పనులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

బెటాలియన్‌లో అభివృద్ధి పనులు ప్రారంభం

Apr 8 2026 8:14 AM | Updated on Apr 8 2026 8:14 AM

ఆదిలాబాద్‌రూరల్‌: బెటాలియన్‌ అభివృద్ధి పనులు సిబ్బంది సంక్షేమానికి, శిక్షణా ప్రమాణాల మెరుగుదలకు ఎంతో దోహదపడతాయని తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ బెటాలియన్స్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ సంజయ్‌కుమార్‌ జైన్‌ అన్నారు. మండలంలోని యాపల్‌గూడ శివారులోని 2వ పోలీస్‌ బెటాలియన్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, సి బ్బంది శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించేందుకు క్రీడా సదుపాయాలు ముఖ్య పాత్ర పోషి స్తాయన్నారు. ఆధునిక సదుపాయాలతో బెటా లియన్‌ మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించగలదన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ రాజర్షి షా, కుమురం ఆసిఫాబాద్‌ ఎస్పీ నితికాపంత్‌, 2వ బెటాలియన్‌ కమాండెంట్‌ బి.వెంకటేశ్వర రెడ్డి, ఏఎస్పీ మౌనిక, సురేందర్‌, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement