ఆరోగ్య ఆదిలాబాద్‌గా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య ఆదిలాబాద్‌గా తీర్చిదిద్దాలి

Apr 8 2026 8:14 AM | Updated on Apr 8 2026 8:14 AM

● కలెక్టర్‌ రాజర్షి షా

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రజారోగ్యమే లక్ష్యంగా పనిచేస్తూ జిల్లాను ఆరోగ్య ఆదిలాబాద్‌గా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని మంగళవారం రిమ్స్‌ ఆడిటోరియంలో నిర్వహించారు. ఎంపీ గోడం నగేశ్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా సేఫ్‌ మ దర్‌ హుడ్‌, ఎయిడ్స్‌ నివారణ, ఆయుష్‌ వంటి అంశాలపై వారం పాటు అవగాహన కార్యక్రమాలు ని ర్వహించనున్నట్లు తెలిపారు. రిమ్స్‌ జిల్లాకే కాకుండా పొరుగు రాష్ట్రాల ప్రజలకు కూడా మెరుగైన వై ద్య సేవలు అందిస్తుందన్నారు. ముఖ్యంగా సర్జికల్‌ ఆంకాలజీ విభాగంలో శస్త్రచికిత్సలు, శిశు మరణాల రేటు తగ్గించేందుకు చేపట్టిన ’సంకల్ప’ ప్రోగ్రాం ద్వారా రిమ్స్‌కు జాతీయస్థాయి గుర్తింపు, టీబీ నివారణలో జిల్లా యంత్రాంగం సాధించిన పురోగతికి గాను అవార్డులు రావడం అభినందనీయమన్నారు. గర్భిణుల్లో రక్తహీనత (అనిమియా) సమ స్య తీవ్రంగా ఉందని, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇచ్చే పౌష్టికాహారం, ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు సక్రమంగా వాడేలా చూడాలన్నారు. అనంతరం ఉత్తమ వైద్య సేవలు అందించిన పలువురు వైద్యులు, సి బ్బందికి, నిక్షయ మిత్రాలకు కలెక్టర్‌, ఎంపీ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. అ నంత రం నూతన టీబీ ఎక్స్‌రే యంత్రాన్ని ఆవిష్కరించి, వ్యాధిగ్రస్తులకు పోషన్‌కిట్‌లు పంపిణీ చేశా రు. కా ర్యక్రమంలో డీఎంహెచ్‌వో రాథోడ్‌ నరేందర్‌, రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, లీగల్‌ అడ్వైజర్‌ గంగారం, వైద్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పదిపరీక్ష కేంద్రం కలెక్టర్‌ తనిఖీ

ఆదిలాబాద్‌టౌన్‌: పదో తరగతి వార్షిక పరీక్షలను విద్యార్థులకు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను మంగళవారం తనిఖీ చేశారు. స్థానిక వినాయక్‌ చౌక్‌లోని బాలక్‌ మందిర్‌ పరీక్ష కేంద్రాన్ని సందర్శించి వసతుల ఏర్పాటుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట అర్బన్‌ తహసీల్దార్‌శ్రీనివాస్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఉదయ్‌రావు, ఆర్‌ఐయజువేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement