ఆరోగ్యంపై దృష్టి సారించాలి
ఆదిలాబాద్‌టౌన్: వయోవృద్ధులు ఆరోగ్యంపై ప్ర త్యేక దృష్టి సారించాలని ట్రెయినీ కలెక్టర్ సలోని చా బ్రా అన్నారు. జిల్లా కేంద్రంలోని వయోవృద్ధుల స మాఖ్య కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన వై ద్యశిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. వృద్ధులు నిత్యం యోగా, మెడిటేషన్ వంటివి చేపట్టి అ నారోగ్య సమస్యలను అధిగమించవచ్చని పేర్కొన్నారు. శిబిరం నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. వైద్యులు క్రాంతి కుమార్, రజిత, కళ్యాణిలు వృద్ధులను పరీక్షించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఇందులో వయోవృద్ధుల సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ దేవిదాస్ దేశ్‌పాండే, అఫ్సర్ ఖాన్, రాంకులకర్ణి పాల్గొన్నారు.


