ఐపీఎస్ హోదా దక్కిన శ్రీనివాస్‌కు సన్మానం
ఆదిలాబాద్‌టౌన్: పట్టణానికి చెందిన సైబేవార్ శ్రీనివాస్‌కు ఇటీవల ఐపీఎస్ హోదా దక్కడం జిల్లాకు గర్వకారణమని సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్ ఖత్రి అన్నారు. ఆదివారం ఆయన నివాసానికి వెళ్లి శాలువాతో సన్మానించారు. ఇందులో సంఘం నాయకులు రవీందర్, దశరథ్, స్వామి, శ్రీనివాస్, అశోక్ తదితరులున్నారు.
కైలాస్‌నగర్: ఇటీవల ఐపీఎస్ హోదా దక్కిన పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్‌బోర్డుకు చెందిన శ్రీ నివాస్‌ను ఆ కాలనీవాసులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించారు. ఇందులో సంజీవ్‌రెడ్డి, అశోక్, పోతా రెడ్డి, సంజయ్ తదితరులున్నారు.


