దళారుల చేతిలో మోసపోవద్దు
ఇంద్రవెల్లి: మొక్కజొన్న సాగు చేసిన రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ డీఎం ప్రవీణ్‌రెడ్డి అ న్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డును ఆదివారం సందర్శించారు. ఆవరణలో ఆరబెట్టిన మొక్కజొన్నను పరిశీలించారు. సిబ్బందిని పంట కొనుగోలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు తేమ శాతం పరిశీ లిస్తూ కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్, మాని టరింగ్ అధికారి సంతోష్, పీఏసీఎస్ సిబ్బంది, రైతులు తదితరులు ఉన్నారు.


