పనులు త్వరగా పూర్తి చేయాలి
బోథ్: మండలకేంద్రంలో చేపట్టిన జూనియర్ సివిల్ కోర్టు భవన నిర్మాణ పనులను హైకోర్టు న్యాయమూర్తి కె.లక్ష్మణ్ ఆదివారం పరిశీలించా రు. పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా నాణ్యతతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయనను స్థానిక న్యాయవాదులు సన్మానించా రు. ఆయన వెంట జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకరరావు, బోథ్ కోర్టు న్యాయమూర్తి పి. మౌనిక, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వామ న్‌రావు దేశ్‌పాండే, కార్యదర్శి శంకర్, అదనపు ఎస్పీ సురేందర్‌రావు, డీఎస్పీ జీవన్‌రెడ్డి, ఆర్డీ వో స్రవంతి, తహసీల్దార్ సుభాష్‌చందర్, ఏపీ పీ శ్రీధర్, న్యాయవాదులు తదితరులున్నారు.


