రియల్‌ ఎస్టేట్‌ ముఠా భారీ కుంభకోణం | - | Sakshi
Sakshi News home page

రియల్‌ ఎస్టేట్‌ ముఠా భారీ కుంభకోణం

Oct 13 2025 7:20 AM | Updated on Oct 13 2025 7:20 AM

రియల్‌ ఎస్టేట్‌ ముఠా భారీ కుంభకోణం

రియల్‌ ఎస్టేట్‌ ముఠా భారీ కుంభకోణం

● ఈడీ, ఎస్‌బీఐ అధీనంలోని రూ.కోట్ల విలువైన భూమి కబ్జా ● ఇద్దరు నిందితుల రిమాండ్‌ ● మరో ఎనిమిది మంది పరారీ

ఆదిలాబాద్‌టౌన్‌: ఈడీ, బ్యాంక్‌ అధీనంలోని రూ.కోట్ల విలువైన భూములను నకిలీ పత్రాలతో కబ్జా చేసిన రియల్‌ ఎస్టేట్‌ ముఠా బండారం బయటపడింది. ఇందులో ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్‌ చేసి 14రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు. ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి ఆదివారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కోర్టు ద్వారా నియమించబడిన అధికారి దుమ్మటి సూర్య రామకృష్ణ సాయిబాబా భూముల కబ్జాకు సంబంధించి ఈనెల 10న ఆది లాబాద్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ప్రకారం.. మనోజ్‌ కుమార్‌ అగర్వాల్‌ అనే వ్యక్తి సర్వే నంబర్‌ 65/బీ, 65/4లోని 2.09 ఎకరాలను జీఎస్‌ ఆయిల్‌మిల్స్‌ పేరుతో ఎస్‌ బీఐలో మార్టిగేజ్‌ చేసి రుణం తీసుకున్నారు. 2012 లో అదే వ్యక్తి 65/4/1 సర్వే నంబర్‌లోని భూమిని నలుగురికి విక్రయించగా, ఆ తర్వాత 2013లో అదే భూమిని డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేశారు. జీపీఏ ఆధారంగా పూనమ్‌ వ్యాస్‌కు, తర్వాత ఆమె అనుపమ వ్యా స్‌కు అమ్మినట్లు తేలింది. అలాగే 2023లో రమేశ్‌శర్మ, అతని కుమారుడు రాకేశ్‌శర్మ, ఇబ్రహీం మ హ్మద్‌ అలియాస్‌ మామ్లా సేట్‌ తదితరులు నకిలీ ప త్రాలు సృష్టించి తహసీల్దార్‌ కార్యాలయంలో రిజి స్ట్రేషన్‌ చేయించుకున్నారు. సర్వే అధికారుల సహకారంతో సప్లిమెంటరీ సేత్వార్‌ పొందారు. 2024 నవంబర్‌ 18న నిందితులు జేసీబీలు, టిప్పర్లతో మొరం పోసి చదును చేసి ఆక్రమించారు. అప్పటికే ఆ స్థలం ఈడీ అధీనంలో ఉంది. అక్కడ రిటైర్డ్‌ ఎస్సై రాములు భద్రత సిబ్బందిగా ఉన్నారు. రాములు అడ్డుకునేందుకు ప్రయత్నించగా నిందితులు అతడిని చంపేస్తామని బెదిరించారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఆదేశాల మేరకు రూరల్‌ సీఐ కె.ఫణీదర్‌ చర్యలు చేపట్టారు.

నిందితులు వీరే..

ఈ కేసులో హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రమేశ్‌శర్మ, భుక్తాపూర్‌కు చెందిన ఇబ్రహీం మహ్మద్‌ అలియాస్‌ మామ్లా సేట్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరితో పాటు నిందితులు యతేంద్రనాథ్‌, హితేంద్రనాథ్‌, రాకేశ్‌శర్మ, మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌, పూనమ్‌ వ్యాస్‌, అనుపమ వ్యాస్‌, సర్వేయర్‌ శివాజీపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

నకిలీ పత్రాలతో భూ ఆక్రమణ

రమేశ్‌శర్మ సర్వే నంబర్‌ 65/ఋ/1 పేరుతో నకిలీ సేత్వార్‌ సృష్టించి ఈడీ అధీనంలోని భూమి స్వాధీ నం చేసుకున్నాడు. కలెక్టర్‌ విచారణలో ఈ కుంభకో ణం వెలుగులోకి రాగా రిజిస్ట్రేషన్లు, సేత్వార్‌లు ర ద్దు చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ ఆధారాలతో రూ రల్‌ పోలీసులు కేసు నమోదు చేసి ప్రధాన నిందితులు రమేశ్‌శర్మ, ఇబ్రహీం మహ్మద్‌ను ఆదివారం అరె స్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో సర్వే అధికారుల సహకారం, సేత్వార్‌ జారీ ప్ర క్రియపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు డీఎస్పీ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement