
బారులు తీరి.. బాధలు చెప్పి
కై లాస్‌నగర్: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌తో తా త్కాలికంగా నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని నోటిఫికేషన్ రద్దుతో సోమవారం పునఃప్రారంభించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు బా రులు తీరి సమస్యలపై ఏకరువు పెట్టారు. కలెక్టర్ రాజర్షి షా వారి నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజు, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 121 అర్జీలు అందినట్లు అధికారులు వెల్లడించారు. అందులో కొందరి నివేదన వారి మాటల్లోనే...