
నిర్వాసితులను ఆదుకోవాలి
భీంపూర్:పిప్పల్‌కోటి భూనిర్వాసితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్ అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ లేఖ రాసినట్లు వెల్లడించారు. గ్రామ రైతులతో సోమవారం ఆయన సమావేశమై మాట్లాడారు. రిజర్వాయర్ కోసం దాదాపు 1200 ఎకరాల సాగు భూమిని రైతులు అందిస్తే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పరిహారం అందించలేదన్నారు. భూసేకరణ చట్టం–2013 ప్రకారం ఎకరాకు రూ.18లక్షలు, కుటుంబంలో ఒకరికి ప్ర భుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరినట్లు తెలిపా రు. పార్టీ జిల్లా కార్యదర్శి కిరణ్, ఆశ న్న, రైతులు నసీరుద్దీన్ స్వామి పాల్గొన్నారు.