
బుక్స్ కూడా ఇవ్వలేదు
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదని మా కు రెండేళ్ల నుంచి యూని ఫాంతో పాటు కనీసం బుక్స్ కూడా ఇవ్వడం లేదు. వాటిని అడిగితే సార్లు మమ్మల్ని టార్గెట్ చేసి కొడుతున్నారు. అంతేకాకుండా సార్ చేనుకు తీసుకెళ్లి అక్కడ పని చేయిస్తున్నారు. దసరా తర్వాత పాఠశాలకు రానివ్వడం లేదు.
– అనుదీప్, 7వ తరగతి, బీఏఎస్ విద్యార్థి
స్కూల్‌కు రానివ్వట్లే.. టీసీ ఇవ్వట్లే
నా కూతురు బెస్ట్ అవలేబు ల్ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతుంది. ప్రభుత్వం ఆ బడికి ఫీజురీయింబర్స్ మెంట్ అందించడం లేదంటూ పిల్లలకు యూనిఫాం, బుక్స్ కూడా ఇవ్వడం లేదు. ఇటు పాఠశాలకు రాన్విడం లేదు. వేరే స్కూల్‌లో చేర్పిద్దామంటే కనీసం టీసీ కూడా ఇవ్వడం లేదు. ఇలా చేస్తే పిల్లల భవిష్యత్ ఏం కావాలి. – కే అరుణ, పేరెంట్

బుక్స్ కూడా ఇవ్వలేదు