
మందకొడిగా..
వాతావరణం
మిగిలింది ఐదు రోజులే దరఖాస్తుల పెంపుపై ఎకై ్సజ్‌శాఖ దృష్టి డీసీ, డీపీఈవోలకు టాస్క్ విధించిన ప్రభుత్వం
ఆదిలాబాద్ 40 1047 43
దరఖాస్తులు
16 నుంచి దండారీ ఉత్సవాలు
దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసీ గిరి జన గ్రామాల్లో నిర్వహించే దండారీ ఉత్సవా లు ఈనెల 16 నుంచి ప్రారంభమవుతాయని గ్రామ పటేళ్లు ప్రకటించారు.
సాక్షి,ఆదిలాబాద్: ‘మీ పరిధిలోని ప్రతీ దుకాణానికి దరఖాస్తు ఫైల్ అయ్యే విధంగా చూడాలి.. ఈ సారి టెండర్ల సంఖ్యలో 10 శాతం వృద్ధి సాధించాలి.. ఏవిధంగా నైనా కొత్త దరఖాస్తుదారుని కనెక్ట్ చేసే పనిని వ్యక్తిగతంగా చేపట్టాలి.. ఆ వివరాలు ఈ సాయంత్రంలోగా పంపండి.. మిగిలిన రోజుల్లో లక్ష్యం సాధించే దిశగా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలి..’ ఇది రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ నుంచి సంబంధిత జిల్లా అధికారులకు సోమవారం అంతర్గతంగా వచ్చిన ఆదేశాలివి.
వైన్స్ షాప్ టెండర్లకు సంబంధించి దరఖాస్తులు పెంచేందుకు ఎకై ్సజ్ అధికారులు అపసోపాలు ప డుతున్నారు. ప్రధానంగా ఈ ప్రక్రియ ప్రారంభమై 18 రోజులు గడిచినప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు మూడంకెల్లోనే దరఖాస్తులు రావడం గమనార్హం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. ఈనెల 18 వరకు దరఖాస్తుకు అవకాశం ఉండటం, మిగిలిన ఐదు రోజుల్లో అన్ని జిల్లాల్లో దరఖాస్తుల సంఖ్య పెంచడంపై ఫోకస్ చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రధానంగా ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్ (డీసీ)తో పాటు జిల్లాల అధికారులైన డీపీఈవోలు టాస్క్‌గా తీసుకొని లక్ష్యం పూర్తి చేయాలని స్పష్టం చేసింది. దీంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కార్యాలయాల్లోనే తిష్టవేసి దరఖాస్తుదారులను రప్పించేలా శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ చివరి రోజుల్లోనే దరఖాస్తులు అధికంగా వస్తాయని, గతంలో కూడా ఇదే విధంగా ప్రక్రియ కొనసాగిందని ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నప్పటికీ లోలోపల మాత్రం సంశయనం చెందుతున్నారు.
పడరాని పాట్లు..
దరఖాస్తుల పెంపుపై ఎకై ్సజ్ అధికారులు అపసోపాలు పడుతున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను బయటకు తీసి ఈసారి చేసుకునేలా వారికి ఫోన్లు చేస్తున్నారు. అలాగే 2023–25లో ఆయా వైన్స్‌ల వారీగా ఎకై ్సజ్ ట్యాక్స్ కంటే ఎంత శాతం అధికంగా ఆయా షాపులు విక్రయాలు చేశాయనే లెక్కలతో వాట్సాప్ గ్రూప్‌లలో సర్క్యులేట్ చేస్తున్నారు. తద్వారా డిమాండ్ షాపులకు అధిక దరఖాస్తులు వచ్చేలా అధికారులు ఫోకస్ పెంచారు. అంతేకాకుండా ఇతర దుకాణాలకు కూడా తప్పనిసరి దరఖాస్తులు వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
పెంచిన ఫీజుతోనేనా..
గతంలో దరఖాస్తు ఫీజు రూ.2లక్షలు ఉండగా, కొత్త ఎకై ్సజ్ పాలసీలో దీనిని రూ.3లక్షలకు పెంచారు. ఈ ప్రభావమే దరఖాస్తులపై పడిందనే చర్చ సాగుతుంది. గతంలో కొత్త దరఖాస్తుదారులు ప్రధానంగా యువత కొంతమంది గ్రూప్‌గా కలిసి వైన్స్‌షాప్ పొందేందుకు దరఖాస్తులు అమితంగా చేసుకునేవారు. అయితే ఈసారి ఫీజు పెరగడంతో ఇలాంటి కొత్త దరఖాస్తుదారులు ఆలోచనలో పడ్డారని చెప్పుకుంటున్నారు. అయితే చివరి రోజుల్లో దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో వస్తాయని ఎకై ్సజ్ అధికారులు పేర్కొంటున్నారు. మంచి రోజు, ఇతరత్రా చూసుకొని పలువురు దరఖాస్తు ప్రక్రియను పెండింగ్‌లో ఉంచారని, అలాంటి వారంతా ఈ మిగిలిన రోజుల్లో ముందుకొస్తారని అంటున్నారు.
ఆదిలాబాద్‌లో దరఖాస్తులు స్వీకరించే కౌంటర్ వద్ద ఎకై ్సజ్ సిబ్బంది
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది.
గత, ప్రస్తుత పాలసీలో వచ్చిన దరఖాస్తుల
సంఖ్య (ఉమ్మడి జిల్లాలో)
జిల్లా వైన్స్
షాపుల 2023లో 2025లో సంఖ్య వచ్చినవి ఇప్పటివరకు
ఆసిఫాబాద్ 32 1020 99
మంచిర్యాల 73 2242 43
నిర్మల్ 47 1067 30
మొత్తం 192 5376 215
చివరి రోజుల్లో అధికంగా..
గడువుకు సమీపిస్తున్న తరుణంలో ఈ మిగిలిన రోజుల్లోనే దరఖాస్తుదారులు ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ముహూర్తాలు చూసుకొని పలువురు దరఖాస్తు చేస్తున్నారు. – రఘురాం, డిప్యూటీ
కమిషనర్, ఎకై ్సజ్ శాఖ, ఆదిలాబాద్ డివిజన్