
పాఠశాల ఆవరణలో నాగుపాము కలకలం
నిర్మల్‌ఖిల్లా: జిల్లా కేంద్రంలోని వెంకటపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం నాగుపాము కనిపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం ఇంటర్వెల్ సమయంలో మూత్రశాలల సమీపంలో నాగుపామును గమనించిన విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయులతో చెప్పా రు. ప్రధానోపాధ్యాయురాలు సుహాసిని శాంతినగర్ కాలనీకి చెందిన స్నేక్‌క్యాచర్ గిరిగంటి అనిల్‌కు సమాచారం అందించడంతో చాకచక్యంగా పామును బంధించి అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు. ఈ సందర్భంగా స్నేక్‌క్యాచర్ అనిల్‌ను అభినందించారు.