
అద్దె కారు తిరిగివ్వని ఇద్దరు..
ఆదిలాబాద్‌టౌన్: కారు అద్దెకు తీసుకొని తిరిగి ఇవ్వని ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. మంగళవారం వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. 2025 మార్చి 28న సునార్ గల్లికి చెందిన అన్నదమ్ములు ముమ్మడివార్ రాకేష్, ముమ్మడివార్ కృష్ణ హైదరాబాద్‌కు వెళ్తామని చెప్పి రవీంద్రనగర్‌కు చెందిన బొడ్గం రాజేశ్ వద్ద కారు అద్దెకు తీసుకున్నారు. ఇప్పటి వరకూ తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను అరె స్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.