
బాసర ఆలయ హుండీ లెక్కింపు
బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ హుండీని మంగళవారం లెక్కించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనాదేవి తెలిపారు. 83 రోజులకు రూ.81,69,099 నగదు, 91 గ్రాముల 500 మిల్లీగ్రాముల మిశ్రమ బంగారం, మూడు కిలోల 500 గ్రాముల మిశ్రమ వెండి, 79 విదేశీ కరెన్సీ నోట్లు సమకూరినట్లు ఈవో తెలిపారు. కార్యక్రమంలో వ్యవస్థాపక ధర్మకర్త శరత్ పాఠక్, ఏఈవో సుదర్శన్ పర్యవేక్షకులు శివరాజ్, తదితరులు పాల్గొన్నారు.
108 ఈఎంటీకి ఉత్తమ సేవా పురస్కారం
ఉట్నూర్‌రూరల్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 108 సిబ్బందికి రాష్ట్ర ఎంఆర్‌ఐ సంస్థ అందించే ఉత్తమ సేవా పురస్కారానికి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ 108లో మెడికల్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న గణేశ్ ఎంపికయ్యారు. మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో పీవో ఖుష్బూ గుప్తా చేతుల మీదుగా పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సామ్రాట్, జిల్లా ఇన్‌చార్జి రాజశేఖర్, పైలట్ సుందర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.