
ఆకట్టుకున్న స్థానిక ఉత్పత్తుల ప్రదర్శన
కైలాస్‌నగర్: నీతి ఆయోగ్ ఆకాంక్ష హాట్– వోకల్ ఫర్ లోకల్ పేరిట జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన స్థానిక ఉత్పత్తుల ప్రదర్శన ఆకట్టుకుంటుంది. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఆదివాసీ కళాకారులు తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్లు, జ్యూట్ బ్యాగులు తదితర వస్తువులను ఇందులో ప్రదర్శనకు ఉంచారు. ఆగస్టు 3 వరకు కొనసాగనున్న ప్రదర్శనను కలెక్టర్ రాజర్షి షా బుధవారం ప్రారంభించారు. వివిధ స్టాల్స్‌ను సందర్శించారు. ఉత్పత్తుల తయారీ విధానం అడిగి తెలుసుకున్నారు. మన గ్రామీణ పారిశ్రామికులను ప్రోత్సహించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, జిల్లా అధికారులు, నీతి ఆయోగ్ ప్రతినిధి రాహుల్, తదితరులు పాల్గొన్నారు.