
గిరాకీ బాగుంది
మాది నిర్మల్ జిల్లాలోని కడెం. ఆరు నెలల క్రితం ఇక్కడికి వచ్చాం. రెవెన్యూ గెస్ట్‌హౌస్ పక్కన ఈ జ్యూస్ సెంటర్ ఏర్పాటు చేశాను. ఉదయం వాకింగ్‌కు వెళ్లేవారితో పాటు చాలా మంది జ్యూస్ తాగుతున్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్, కొలస్ట్రాల్ ఉన్నవారు ఎక్కువగా తీసుకుంటున్నారు. గోధుమ గడ్డి, గుమ్మడి, సోరకాయ, బీట్రూట్, క్యారెట్, ఆపిల్, కాకర జ్యూస్‌లు లభిస్తాయి. ఉదయం 5.30 నుంచి 10.30 గంటల వరకు గిరాకీ ఉంటుంది.
– రవికిరణ్, జ్యూస్‌ల తయారీదారుడు
ఉల్లాసంగా ఉంటుంది..
నేను మూడు నెలల నుంచి క్రమం తప్పకుండా ఈ జ్యూస్‌లే తాగుతున్నా. ఉదయం షటిల్ ఆడిన తర్వాత స్నేహితులందరితో కలిసి ఇక్కడికి చేరుకుంటాం. కాసేపు సేదతీరి జ్యూస్ తాగుతాం. రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. ఆరోగ్యం కోసం ఆహార నియమాలు కూడా పాటిస్తున్నాను.
– లోక ప్రవీణ్‌రెడ్డి,
ఆదిలాబాద్

గిరాకీ బాగుంది