మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం | - | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం

Oct 24 2024 12:43 AM | Updated on Oct 24 2024 12:43 AM

మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం

మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం

● వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి

కై లాస్‌నగర్‌: వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రజాసేవభవన్‌ను సందర్శించారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న క్రమంలో కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. ఆయనకు పార్టీ నాయకులు స్వాగతం పలికారు. రాష్ట్రంలో త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయ ఢంకా మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఆయన వెంట జైనథ్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అల్లూరి అశోక్‌ రెడ్డి, నాయకులు ప్రవీణ్‌ రెడ్డి, సంతోష్‌రావు, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు చరణ్‌ గౌడ్‌, కౌన్సిలర్లు శ్రీనివాస్‌, సతీష్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement