నిర్మల్‌చైన్‌గేట్: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకోసం జిల్లాకు కేటాయించిన అదనపు ఈవీఎంల ఫస్ట్ లెవల్ తనిఖీ పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం, వీవీప్యాట్ల గోడౌన్‌లో చేపట్టిన తనిఖీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల కోసం 1564 బ్యాలెట్ యూనిట్లు, 1067 కంట్రోల్ యూనిట్లు, 1322 వీవీప్యాట్‌ల మొదటి దశ తనిఖీలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేశామన్నారు. జిల్లాకు అదనంగా కేటాయించిన 305 కంట్రోల్ యూనిట్ల ఫస్ట్ లెవల్ తనిఖీలు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోల్ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాస్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.