కంటైనర్‌ ఢీ.. యువ ఇంజనీర్‌ తీవ్ర విషాదం! | - | Sakshi
Sakshi News home page

కంటైనర్‌ ఢీ.. యువ ఇంజనీర్‌ తీవ్ర విషాదం!

Jan 8 2024 11:44 PM | Updated on Jan 9 2024 11:40 AM

- - Sakshi

అఖిలేష్‌ (ఫైల్‌)

ఆదిలాబాద్‌: రోడ్డు ప్రమాదంలో ఓ యువ ఇంజనీర్‌ దుర్మరణం పాలయ్యాడు. కంటైనర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. రోడ్డు నిబంధనలు పాటించకుండా అతి వేగంగా రాంగ్‌రూట్‌లో వచ్చి బైక్‌పై వెళ్తున్న కొస్మెట్టి అఖిలేష్‌ (29)ను ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోనే తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన మావల పోలీసు స్టేషన్‌ పరిధిలో ని బైపాస్‌ జాతీయ రహదారి 44 బట్టిసావర్గాం శివారులో సోమవారం చోటు చేసుకుంది.

ఏం జరిగిందంటే..
తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ) విభాగంలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ)గా విధులు నిర్వహిస్తున్న అఖిలేష్‌ విధి నిర్వహణలో భాగంగా బోథ్‌ మండల కేంద్రానికి బైక్‌పై వెళ్లాడు. తిరుగుప్రయాణంలో బట్టిసావర్గాం శివారు ప్రాంతంలో కంటైనర్‌ ఢీకొట్టడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మావల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు మావల ఎస్సై విష్ణువర్ధన్‌ తెలిపారు.

తీరని శోకం..
ఆదిలాబాద్‌ పట్టణంలోని పాత హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఉపాధ్యాయుడు జైరామ్‌–పద్మ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. జైరామ్‌ పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. చేతికొచ్చిన కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబంలో తీరని శోకం నెలకొంది.

ఇవి చదవండి: బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య..

Advertisement
 
Advertisement
Advertisement