రూ.4 లక్షల ఖరీదైన బైక్‌ చోరీ | - | Sakshi
Sakshi News home page

రూ.4 లక్షల ఖరీదైన బైక్‌ చోరీ

Aug 18 2024 11:44 PM | Updated on Aug 18 2024 11:44 PM

రూ.4

రూ.4 లక్షల ఖరీదైన బైక్‌ చోరీ

పెద్దాపురం: స్థానిక బ్యాంక్‌ కాలనీలో సుమారు రూ.నాలుగు లక్షల విలువైన బైక్‌ చోరీకి గురైనట్లు ఆదివారం ఫిర్యాదు అందింది. స్థానిక ఎస్సై మౌనిక తెలిపిన వివరాల మేరకు స్థానిక నియర్స్‌ కింగ్‌ ఓపెరా అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఆర్‌అండ్‌బి డీఈ ఎం.నాగేశ్వరరావుకు చెందిన ఏపీ39క్యూజే 3838 నెంబరు గల బైక్‌ యథావిధిగానే పార్క్‌ చేసి ఉంచారు. ఆదివారం ఉదయం లేచి చూసేసరికి బైక్‌ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బహ్రెయిన్‌లో పెదపట్నంలంక యువకుడి ఆత్మహత్య

మామిడికుదురు: ఉపాధి కోసం బహ్రెయిన్‌ వెళ్లిన పెదపట్నంలంక యువ కుడు ఉరి వేసుకుని చనిపోయాడని కుటుంబ సభ్యులకు శనివారం రాత్రి సమాచారం రావడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళితే మామిడికుదురు మండలం పెదపట్నంలంక శివారు దుర్గాపట్నానికి చెందిన నాగులాపల్లి వీర వెంకటదుర్గా నాగసాయి (22) బహ్రెయన్‌లో శనివారం ఉరి వేసుకుని చనిపోయాడు. గత నెల 22న ఇంటి నుంచి వెళ్లిన నాగసాయి 29న బెహ్రెయిన్‌ చేరుకున్నాడని అతని మేనమామ ఉండపల్లి రమేష్‌ అలియాస్‌ శ్రీను ఆదివారం తెలిపారు. అక్కడ పెట్రోల్‌ బంకులో పని చేస్తున్నాడని, అక్కడి సమస్యలపై ఎప్పుడూ చెప్పలేదని, చనిపోవడానికి రెండు రోజులు ముందు కూడా ఫోన్లో మాట్లాడాడని ఆయన తెలిపారు. నాగసాయి మృతిపై విచారణ జరిపించాలని, అతని మృతదేహాన్ని స్వదేశం రప్చించేందుకు సహకరించాలని ఎంపీ గంటి హరీష్‌ మాధుర్‌, పి.గన్నవరం ఎమ్మె ల్యే గిడ్డి సత్యనారాయణను కోరారు. ఇండియన్‌ ఎంబసీ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని మేనమామ తెలిపారు.

చెరువులో మునిగి వ్యక్తి మృతి

కొత్తపల్లి: ప్రమాదశాత్తు చెరువులోపడి ఒక వ్యక్తి మృతి చెందినట్టు పోలీసులు ఆదివారం తెలిపారు. మండలంలోని కొమరగిరి శివారు చిన్న కలవలదొడ్డికి చెందిన దొంగల శ్రీను(48) అదే గ్రామంలో ఉన్న కఠారి చంటిబాబు పొలంలో ఉన్న చెరువులోకి గేదెను కడిగేందుకు దిగాడు. ప్రమాదశాత్తు అదుపుతప్పి చెరువులో పడి మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎస్సై వెంకటేష్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

రూ.4 లక్షల ఖరీదైన బైక్‌ చోరీ 1
1/1

రూ.4 లక్షల ఖరీదైన బైక్‌ చోరీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement