breaking news
Zidane Football Club
-
ఫ్రాన్స్ హెడ్ కోచ్‌గా జిదాన్
దిగ్గజ ఫుట్‌బాలర్ జినెదిన్ జిదాన్‌ను ఫ్రాన్స్ ఫుట్‌బాల్ సమాఖ్య (FFF) తమ జాతీయ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా ప్రకటించింది. 14 ఏళ్ల పాటు జట్టును నడిపించిన డిడియర్ డెషాంప్స్ 2026 ప్రపంచకప్ సెమీఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓటమి అనంతరం పదవి నుంచి తప్పుకున్నాడు.54 ఏళ్ల జిదాన్ 2021లో రియల్ మాడ్రిడ్‌ను విడిచిన తర్వాత మళ్లీ కోచింగ్ బాధ్యతలు చేపట్టలేదు. ఇప్పుడు 2030 ప్రపంచకప్ అర్హత పోటీల వరకు కొనసాగే ఒప్పందంపై ఫ్రాన్స్ జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యాడు.కొత్త బాధ్యతపై జిదాన్ మాట్లాడుతూ.. "ఫ్రాన్స్ జాతీయ జట్టుకు కోచ్‌గా నియమితుడవడం నాకు ఎంతో గర్వకారణం. ఈ జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప బాధ్యత. అత్యున్నత లక్ష్యాలతో ముందుకు సాగుతాను" అని అన్నాడు.డెషాంప్స్ నాయకత్వంలో ఫ్రాన్స్:* 2018 ఫిఫా ప్రపంచకప్ విజేత* 2022 ప్రపంచకప్ రన్నరప్* మొత్తం మూడు ప్రధాన టోర్నీల ఫైనల్స్‌కు చేరింది.జిదాన్ కోచ్‌గా సాధించిన విజయాలు:రియల్ మాడ్రిడ్‌కు కోచ్‌గా:* 3 వరుస UEFA ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లు (2016, 2017, 2018)* 2 లా లిగా టైటిళ్లు* అనేక అంతర్జాతీయ ట్రోఫీలుఛాంపియన్స్ లీగ్ యుగంలో వరుసగా మూడు సార్లు ట్రోఫీ గెలిచిన తొలి కోచ్‌లలో జిదాన్ ఒకరు.ఆటగాడిగా జిదాన్..* 1998 ప్రపంచకప్ విజేత* యూరో 2000 ఛాంపియన్* 1998 బాలన్ డి'ఓర్ విజేత1998 ప్రపంచకప్ ఫైనల్లో బ్రెజిల్‌పై రెండు హెడర్లతో ఫ్రాన్స్‌కు తొలి ప్రపంచకప్‌ను అందించాడు. 2006 ప్రపంచకప్ ఫైనల్లో ఇటలీ ఆటగాడు మార్కో మెటరాజీకి హెడ్‌బట్ చేయడంతో రెడ్ కార్డ్ అందుకోవడం కూడా ఫుట్‌బాల్ చరిత్రలో గుర్తుండిపోయే సంఘటనల్లో ఒకటిగా నిలిచింది.తొలి మ్యాచ్ఫ్రాన్స్ హెడ్ కోచ్‌గా జిదాన్ తన తొలి అధికారిక మ్యాచ్‌ను సెప్టెంబర్ 25న టర్కీతో జరిగే UEFA నేషన్స్ లీగ్ మ్యాచ్ ద్వారా ఆరంభించనున్నాడు. ఫ్రాన్స్ అభిమానులు అతడి నాయకత్వంలో జట్టు మళ్లీ ప్రపంచ ఫుట్‌బాల్‌లో అగ్రస్థానానికి చేరుతుందనే ఆశతో ఉన్నారు. -
చాంపియన్ జిదాన్ ఫుట్‌బాల్ క్లబ్
సాక్షి, హైదరాబాద్: కల్యాణ్, వాసన్ స్మారక 7 ‘ఎ’ సైడ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో జిదాన్ ఫుట్‌బాల్ క్లబ్ చాంపియన్‌గా నిలిచింది. యంగ్ డైనమోస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఈసీఐఎల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరిగిన ఫైనల్లో జిదాన్ ఫుట్‌బాల్ క్లబ్ 1–0తో రెయిన్బో ఫుట్‌బాల్ క్లబ్‌పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో అబ్బాస్ యూనియన్‌పై జిదాన్, యూఎస్ఎఫ్సీపై రెయిన్బో జట్లు విజయం సాధించాయి. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం కార్యదర్శి జీపీ ఫల్గుణ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. రెండు రోజుల పాటు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నీని నిర్వహించారు. విజేతగా నిలిచిన జిదాన్ జట్టుకు రూ. 7000, రెయిన్బో జట్టుకు రూ. 5000 ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ కార్యక్రమలో ఈసీఐఎల్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ సభ్యులు బాలమురుగన్, భాస్కర్ రెడ్డి, నరసింహా తదితరులు పాల్గొన్నారు.


