breaking news
yuva raj
-
కేజీఎఫ్ మేకర్స్ భారీ సర్ప్రైజ్.. యువరాజ్ కుమార్ తెరంగేట్రం!
కేజీఎఫ్ చిత్రం ఎంత పెద్ద హిట్టైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. ఇక దానికి సీక్వెల్‌గా వచ్చిన కేజీయఫ్ చాప్టర్-2 ఇటీవలే విడుదలయి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్‌కు ఎంత పేరు వచ్చిందో ఆ చిత్ర నిర్మాణ సంస్థ అయిన 'హోంబలే ఫిలిమ్స్'కు కూడా అంతే పేరు వచ్చింది. ప్రస్తుతం హోంబలే ఫిలిమ్స్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. కాగా తమ తదుపరి చిత్రాన్ని ప్రకటించి హోంబలే ఫిలిమ్స్ సర్ప్రైజ్ ఇచ్చింది. కన్నడ కంఠీరవ, లెజెండరీ నటుడు రాజ్ కుమార్ మనవడు, దివంగత పునీత్ రాజ్ కుమార్ సోదరుడు, యాక్టర్ రాఘవేంద్ర రాజ్ కుమార్ కుమారుడు యువరాజ్ కుమార్‌తో హోంబలే ఫిలిమ్స్ కొత్త సినిమా అంటూ యువరాజ్ లుక్‌తో కూడిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సినిమాతోనే యువరాజ్ కుమార్ హీరోగా వెండి తెరకు పరిచయం అవుతున్నాడు. యువరాజ్ ఇంట్రడక్షన్ పోస్టర్లను విడుదల చేస్తూ దానికి వారసత్వం కొనసాగుతుందని క్యాప్షన్ ఇచ్చారు. పునీత్ రాజ్ కుమార్‌కు 'యువరత్న' లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన సంతోష్ ఆనంద్రమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ಅಭಿಮಾನದಿಂದ ಅಭಿಮಾನಕ್ಕಾಗಿ ಈ ನಮ್ಮ ಪಯಣ. ಇರಲಿ ನಿಮ್ಮ ಅಪ್ಪುಗೆ The legacy continues..@yuva_rajkumar @SanthoshAnand15 @VKiragandur @hombalefilms#IntroducingYuvaRajKumar #YuvaRajKumar pic.twitter.com/c4vsklAYFj — Hombale Films (@hombalefilms) April 27, 2022 -
నేడు బోల్ట్ సందడి
యువరాజ్‌తో క్రికెట్ ఆడనున్న స్ప్రింట్ స్టార్ బెంగళూరు: ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తగల అథ్లెట్.. జమైకన్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ తొలిసారిగా భారత్‌లో సందడి చేయనున్నాడు. అయితే ఇక్కడి అభిమానులు మాత్రం అతని పరుగు విన్యాసాన్ని చూడలేరు. ఎందుకంటే బోల్ట్ ఇక్కడికి ప్రస్తుతం అథ్లెట్‌గా కాకుండా ‘క్రికెటర్’గా వచ్చాడు. పుమా షూస్ కంపెనీ ప్రమోషనల్ కార్యక్రమంలో భాగంగా నేడు (మంగళవారం) స్థానిక చిన్నస్వామి స్టేడియంలో బోల్ట్ క్రికెట్ ఆడనున్నాడు. ప్రత్యర్థి ఎవరో కాదు.. డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. సెవెన్-ఎ-సైడ్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో భాగంగా వీరు ప్రత్యర్థులుగా బరిలోకి దిగబోతున్నారు. ఒక్కో ఇన్నింగ్స్ నాలుగు ఓవర్ల పాటు కొనసాగుతుంది. బోల్ట్ జట్టులో అతడి స్నేహితుడు నుజెంట్ వాల్కర్ జూనియర్, స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఉండగా.. యువీ జట్టులో పేసర్ జహీర్ ఖాన్ ఉన్నాడు. మాజీ క్రికెటర్ అజయ్ జడేజా మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఫేస్బుక్, ట్విట్టర్లో పుమా క్రికెట్ నిర్వహించిన డిజిటల్ కాంటెస్ట్‌లో నెగ్గిన ఏడుగురు విజేతలు కూడా ఇతర సభ్యులుగా ఉంటారు. ఈ మ్యాచ్‌లో బోల్ట్, యువీ పూర్తి ఓవర్లపాటు బ్యాటింగ్ చేస్తారు. అలాగే వికెట్ పడిన ప్రతిసారి జట్టు స్కోరులో నాలుగు పరుగులు తగ్గుతాయి.